English | Telugu

ఆ రూమర్లు నిజం అయితే బాగుండు.. కంచె హీరోయిన్

కంచె సినిమాలో తన అందంతో, అంతకు మించి అభినయంతో అందరిని ఆకట్టుకుంది ప్రగ్యా జైస్వాల్. సాధారణంగా సినిమా హిట్ అయిందంటే హీరోయిన్ కు అవకాశాల మీద అవకాశాలు తలుపుతడతాయి. అలాగే వాటితోపాటు రూమర్లు కూడా చక్కెర్లు కొడతాయి. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది ప్రగ్యా జైస్వాల్. మురుగుదాస్ - మహేశ్ కాంబినేషల్లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా నటించబోతుందంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని.. కాని తనకు కూడా మహేశ్ తో నటించాలని ఉందని..ఈ రూమర్లు నిజం అయితే ఎంత బాగుండు అని క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి నటించడంలేదు అని క్లారిటీ ఇస్తూనే తన మనసులో కోరికను చెప్పినట్టుంది ఈ భామ.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.