English | Telugu

‘కాంటాలగా గర్ల్‌’ మృతి అనుమానాస్పదం.. 5 గంటల ముందు భర్త ఏం చేశాడో తెలుసా?

2000వ దశకం ప్రారంభంలో వీడియో ఆల్బమ్స్‌కి విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ సమయంలో షాన్‌, అద్నాన్‌ సామి, సునీతారావు వంటివారు తమ వీడియోస్‌ ద్వారా టీవీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నారు. 2002లో షెఫాలి జరీవాలా నటించిన డిజె డాల్‌ ఆల్బమ్‌లోని ‘కాంటాలగా’ వీడియో సాంగ్‌ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. వివిధ ఛానల్స్‌లో ఈ పాటను పదే పదే ప్రసారం చేసేవారు. ఆ ఒక్క పాటతో ఎంతో ఫేమస్‌ అయిపోయారు షెఫాలి. ఈ వీడియో విడుదలై 20 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ ఈ పాటను వీక్షిస్తూనే ఉంటారు. అంతటి పాపులర్‌ నటి హఠాన్మరణం అందర్నీ బాధిస్తోంది. జూన్‌ 27 రాత్రి గుండెపోటుతో షెఫాలి మృతి చెందింది. అయితే పోలీసులు మాత్రం దీన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు.

ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడానికి కారణం.. షెఫాలి మరణించిన వెంటనే ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించకపోవడం, చాలా ఆలస్యంగా స్పందించడం పోలీసుల్లో అనుమానాన్ని రేకెత్తిస్తోంది. జూన్‌ 28న షెఫాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక ఇంకా రావాల్సి ఉంది. షెఫాలి మరణించడానికి 5 గంటల ముందు ఆమె భర్త పరాగ్‌ త్యాగి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఆ పోస్ట్‌లో తను జిమ్‌లో ఉన్నట్టుగా మిర్రర్‌ సెల్ఫీని పోస్ట్‌ చేశాడు. షెఫాలి మరణం వెనుక కారణాలు ఏమిటి అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. షెఫాలి పాపులర్‌ నటి. ఆమె మరణాన్ని కుటుంబ సభ్యులుగానీ, ఆమె ప్రతినిధులుగానీ అధికారికంగా ప్రకటించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె మరణం వెనుక ఏదైనా మిస్టరీ దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

బిసిఎ పూర్తి చేసిన షెఫాలి 2002లో వచ్చిన ‘డిజె డాల్‌’ అనే ఆల్బమ్‌లోని ‘కాంటాలగా’ వీడియో సాంగ్‌లో తన పెర్‌ఫార్మెన్స్‌తో, అందచందాలతో యూత్‌కి పిచ్చెక్కించింది. 2004లో మీత్‌ బ్రదర్స్‌లోని హర్‌మీత్‌ సింగ్‌ను వివాహం చేసుకున్నారు షెఫాలి. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2009లో విడిపోయారు. ఆ తర్వాత 2015లో నటుడు పరాగ్‌ త్యాగిని వివాహం చేసుకున్నారు. వీడియో ఆల్బమ్స్‌లోనే కాకుండా హిందీ సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌లలో నటించారు. కొన్ని టీవీ షోలలో కూడా కనిపించారు. 2018లో బిగ్‌బాస్‌ 13లో కూడా షెఫాలి పార్టిసిపేట్‌ చేశారు.