English | Telugu
పవన్ కళ్యాణ్ టైటిల్ వద్దన్న నితిన్.. టైం ఎప్పుడు ఒకేలా ఉండదు
Updated : Jun 28, 2025
నితిన్(Nithiin)హీరోగా తెరకెక్కిన 'తమ్ముడు'(Thammudu)మూవీ జులై 4 న విడుదల కానుంది. దిల్ రాజు(Dil Raju)నిర్మాణ సారధ్యంలో, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో వకీల్ సాబ్ ని తెరకెక్కించిన 'వేణు శ్రీరామ్'(venu Sriram)దర్శకుడు. దీంతో 'తమ్ముడి' పై అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. ప్రచార చిత్రాలు కూడా బాగుండటంతో సినిమా ఫలితంపై అందరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 2020 లో వచ్చిన భీష్మ లాంటి హిట్ మూవీ తర్వాత నితిన్ కి సరైన హిట్ లేదు.
రీసెంట్ గా నితిన్ ఒక ఇంటర్వ్యూలో తమ్ముడు చిత్రం గురించి మాట్లాడుతు ఈ చిత్రానికి తమ్ముడు అనే టైటిల్ ఫిక్స్ అయినప్పుడు నేను వద్దని అన్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో ఇప్పటికే నా సినిమాలల్లో ఎన్నో చేస్తున్నాననే విమర్శలు ఉన్నాయి, ఈ కారణంతోనే 'తమ్ముడు' టైటిల్ వద్దని అన్నాను. కానీ సబ్జెట్ కి తమ్ముడు టైటిల్ పర్ఫెక్ట్ గా సూటవుతుందని వేణుశ్రీరామ్,దిల్ రాజు చెప్పడంతో అంగీకరించానని చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ కి నితిన్ వీరాభిమాని అనే తెలిసిన విషయమే. తను ఇప్పటి వరకు చేసిన చాలా సినిమాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ హిట్ లిస్ట్ లో ఉన్న మూవీస్ లో 'తమ్ముడు' కూడా ఒకటి. 1999 లో వచ్చిన ఈ మూవీ కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది.