English | Telugu

ఫహద్‌ ఫాజిల్‌ నుంచి నజీమ్‌ విడాకులు తీసుకోనుందా.. ఆమె పోస్ట్‌ వెనుక రీజన్‌ అదేనా?

చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఎంతో సర్వసాధారణ విషయం. ఎప్పుడు ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకుంటారో.. పెళ్లి చేసుకున్న జంటలు ఎప్పుడు విడాకులు తీసుకుంటారో ఎవరికీ తెలీదు. నటీనటులు తమ సహచరుల్ని పెళ్లి చేసుకోవడం, కొంతకాలం వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవడం మనం చూస్తున్నాం. ఇటీవలికాలంలో ఇలా విడిపోతున్న జంటల సంఖ్య పెరుగుతోంది. తాజాగా హీరోయిన్‌ నజ్రియా నజీమ్‌ కూడా భర్త ఫహద్‌ ఫాజిల్‌ నుంచి విడిపోతోందా అనే ప్రచారం సోషల్‌ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది.

2014లో తన కంటే దాదాపు 12 సంవత్సరాలు వయసులో పెద్దవాడైన నటుడు ఫహద్‌ ఫాజిల్‌ను పెళ్లి చేసుకున్నారు నజ్రియా. బెంగళూరు డేస్‌ చిత్రంతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె తమిళ్‌లో చేసిన రాజా రాణి చిత్రంతో మరింత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై ఘనవిజయం సాధించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు అభిమానులు పెరిగారు. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించి ఉంటే తెలుగులో కూడా బిజీ హీరోయిన్‌ అయి ఉండేది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నజ్రియా చివరి పోస్ట్‌ గత డిసెంబర్‌లో చేసింది. అప్పటి నుంచి ఎవరికీ అందుబాటులో లేదు. తను చేసిన చివరి సినిమా సూక్ష్మదర్శిని సూపర్‌హిట్‌ అయింది. దాంతో ఆమెకు ఇండస్ట్రీ నుంచి, సోషల్‌ మీడియాలో విపరీతంగా పోస్టులు, మెసేజ్‌లు వెళ్లాయి. కానీ, వేటికీ ఆమె స్పందించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే తన ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమలోని ఫ్రెండ్స్‌.. ఇలా ఎవరు కాల్‌ చేసినా ఆమె ఆన్సర్‌ చేయలేదట. ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ తాజాగా ఒక ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేసింది నజ్రియా.

‘అందరూ నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇన్నిరోజులు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నాను. ఎవరి ఫోన్లూ లిఫ్ట్‌ చేయలేదు. ఇంత కాలం నేను కొంత డిప్రెషన్‌లో ఉన్నాను. కొన్ని కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఎవరికీ అందుబాటులో లేను. నేను చేసిన సూక్ష్మదర్శిని సినిమా సూపర్‌హిట్‌ అని టాక్‌ వచ్చిన తర్వాత నన్ను అభినందించేందుకు ఎంతో మంది ఫోన్లు చేశారు. కానీ, ఎవ్వరి ఫోన్లూ లిఫ్ట్‌ చెయ్యలేదు. నా 30వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అన్నీ మిస్‌ చేసుకున్నాను. ఎవరికీ అందుబాటులో లేకుండా ఉండడం నన్ను బాధించింది. అందుకే అందరికీ సారీ చెప్పేందుకు మీ ముందుకు వచ్చాను. ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌, ఫాలోవర్లు, అభిమానులు.. అందరికీ సారీ’ అంటూ పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌ చూసిన వారంతా రకరకాలుగా ఆమె గురించి, ఆమె భర్త ఫహద్‌ గురించి చెప్పుకుంటున్నారు. వారి మధ్య విడాకుల ఇష్యూ ఏదైనా నడుస్తుందా అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఆమె పెట్టిన పోస్ట్‌ చివరలో నజ్రియా నజీమ్‌ ఫహాద్‌ అని తన పేరును మెన్షన్‌ చెయ్యడంతో అలాంటివి ఏమీ లేవు అంటున్నారు. ఆమె పోస్ట్‌ పెట్టిన తర్వాత సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వారి విడాకుల వార్త గురించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...