English | Telugu
‘కన్నప్ప’ షూటింగ్‌లో ప్రమాదం.. మంచు విష్ణుకు గాయాలు!
Updated : Oct 29, 2023
గత కొన్నిరోజులుగా మంచు విష్ణు చేస్తున్న ‘కన్నప్ప’ సినిమాకి సంబంధించిన వార్తలు విరివిగా రావడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో మంచు విష్ణు గాయపడ్డాడని వార్తలు వస్తున్నాయి. గాయపడిన విష్ణుని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. పెద్ద ప్రమాదం కాకపోయినా షూటింగ్ జరిగే పరిస్థితి లేకపోవడంతో క్యాన్సిల్ చేశారు.
‘కన్నప్ప’ అనే టైటిల్‌తో విష్ణు సినిమా చేస్తున్నాడనే వార్త మీడియాలో రావడం, ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారని తెలియడంతో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తీసుకొస్తున్నాడు మంచు విష్ణు. దీంతో కన్నప్ప రేంజ్ ఒక్కసారిగా అలా పెరిగిపోయింది. వీరితోపాటు మరికొందరు స్టార్లు కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందన్న వార్తలు కూడా రావడంతో ఎవ్వరూ ఊహించని రేంజ్‌కి సినిమా వెళ్లిపోయింది.
‘కన్నప్ప’ షూటింగ్‌లో ప్రమాదం ఎలా జరిగింది?
ఈ సినిమాలోని కొన్ని యాక్షన్స్ సీక్వెన్సులను డ్రోన్ సాయంతో షూట్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే డ్రోన్ అదుపు తప్పి నేరుగా వచ్చి మంచు విష్ణు మీద పడిరదట. దాంతో అతని చేతికి పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న విష్ణు క్షేమంగానే ఉన్నాడని సమాచారం. అయితే కొన్ని రోజులపాటు షూటింగ్‌ను వాయిదా వేశారని తెలుస్తోంది.
‘మహాభారతం’ సీరియల్‌ను బుల్లితెరపై అత్యద్భుతంగా తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి ప్రముఖులు ఈ సినిమాకు రచనా సహకారం అందిస్తున్నారు.