English | Telugu

అమీర్ ఖాన్ ‘పీకే’ ఫీవర్ ఊపేస్తోంది

అమీర్ ఖాన్, అనుష్క శర్మ కాంబినేషన్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘పీకే’ ఈ రోజు ప్రప౦చవ్యాప్తంగా విడుదలైంది. ‘పీకే’ సినిమా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పటికే బోలెడంత ప్రచారం వచ్చేసింది. ఆ ప్రచారాన్ని క్యాష్ చేసుకోవాలని భావించిన నిర్మాతలు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో ఈ ఒక్క రోజు మల్టీప్లెక్స్ థియేటర్లలో 160 షోలు వేస్తున్నార౦టే ఈ సినిమా క్రేజ్ ఏ రెంజులో వుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ షో లకి సంబంధించిన టికెట్ లన్ని ముందే బుక్ అయిపోవడం మరో విశేషం. అయితే ఈ వారం తెలుగులో పెద్ద సినిమాలేవి రిలీజ్ కాకపోవడం కూడా ‘పీకే’ కి బాగా కలిసివచ్చింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.