English | Telugu
శర్వానంద్, రవితేజ అయితే బాగుంటుందంటున్నారు
Updated : Mar 11, 2016
హీరోగా బాగానే చేస్తున్నాడు. సినిమా సినిమాకీ ఈజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. కానీ వెయిట్ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఆ హీరోగారు. వరస వైవిధ్యమైన సినిమాలతో, అద్భుతంగా ఇప్పుడున్న ఏ హీరోకి లేనంత జోరుతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నారా రోహిత్, ఓవర్ వెయిట్ అయిపోయాడనే టాక్ అంతటా వినిపిస్తోంది. బాణం సినిమాకు ఇప్పటికీ, రోహిత్ బాడీ చాలా ఛేంజ్ వచ్చేసింది. హెవీ వెయిట్ తో తను ఇబ్బంది పడటమే కాక, అప్పుడప్పుడూ ప్రేక్షకుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు.
తాజాగా తుంటరిలో సేమ్ సిట్యూవేషన్. సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నా, మంచి టాక్ వచ్చినా, నెగటివ్స్ లో మాత్రం రోహిత్ వెయిట్ కంపల్సరీ కనిపిస్తోంది. కథ బట్టి చూస్తే, ఈ సినిమాకు శర్వానంద్ లేదా రవి తేజ అయితే కరెక్ట్ గా సెట్ అవుతారనే టాక్ వినిపిస్తోంది. తుంటరి క్లైమాక్స్ అమ్మనాన్న ఒక తమిళమ్మాయి సినిమాకు దగ్గరగా ఉంది. అందుకే ఆల్రెడీ చేసిన రవితేజ గానీ, లేక శర్వానంద్ గానీ ఈ సబ్జెక్ట్ యాప్ట్ గా సెట్ అవుతుందని మొదటి ఆట ఆడియన్స్ అంటున్నారు. బాక్సర్ గా చేయాలి కాబట్టి, రోహిత్ కాస్త సన్నబడి ఉంటే బాగుండేది. మరి నారావారబ్బాయి తన వెయిట్ పై ఇకనైనా దృష్టి పెడతాడో లేదో చూడాలి.