English | Telugu

బెంగ‌ళూరులో మొదలైన యశ్‌ ‘టాక్సిక్‌’


బాక్సాఫీస్ సెన్సేష‌న్ రాకింగ్ స్టార్ య‌శ్ హీరోగా బెంగ‌ళూరులో భారీ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ నేడు పూజా కార్యక్రమాలతో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్ తెర‌కెక్కించ‌నున్నారు.

గురువారం జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మాల్లో సంప్రదాయానికి అనుగుణంగా నటుడు, నిర్మాత యశ్, నిర్మాత వెంకట్ కె.నారాయణ, వారి కుటుంబ సభ్యులతో కలిసి సినిమా విజయం సాధించాలని దేవుడి ఆశీస్సులు కోరారు. పూజా కార్య‌క్ర‌మాల్లో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై టీమ్‌కి అభినందన‌లు తెలిపారు.

కెజియ‌ఫ్ త‌ర్వాత య‌శ్‌ ఎలాంటి సినిమా చేస్తారోన‌ని ఆస‌క్తిగా ఎదురు చూసిన అభిమానుల నిరీక్ష‌ణ‌కు ఈరోజుతో తెర‌ప‌డింది. అలాగే సినిమా ప్రారంభ‌మైన రోజుని న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం చూసిన 8-8-8ను సూచిస్తుంది. ఇది య‌శ్ పుట్టిన‌రోజును తెలియ‌జేస్తుంది.

గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న‌ "టాక్సిక్ష‌ను విజువ‌ల్ గ్రాండియ‌ర్ మూవీగా, ఎమోష‌న‌ల్‌, ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌తో తెర‌కెక్కించ‌నున్నారు. దీని కోసం స్టార్ యాక్ట‌ర్స్‌, టెక్నిక‌ల్ టీమ్ చేతులు క‌లిపింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...