English | Telugu

అల్లు అర్జున్‌పై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు.. ‘పుష్ప2’ రిలీజ్‌కి కష్టాలు తప్పవా?

‘40 ఏళ్ళ క్రితం మన సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే.. హీరోనే అడవుల్లోని చెట్లను నరికి స్మగ్లింగ్‌ చేస్తున్నాడు. ఇదీ ప్రస్తుత సినిమా పరిస్థితి’... బెంగళూరు పర్యటనలో భాగంగా ఓ ప్రెస్‌మీట్‌లో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడిన మాటలివి. ఈ మాటలు ఏ సినిమాని ఉదేశించి అన్నారు, ఈ స్టేట్‌మెంట్‌ ద్వారా ఎవరిని టార్గెట్‌ చేశారు అనేది కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. పనిగట్టుకొని పవన్‌కళ్యాణ్‌ ఈ కామెంట్స్‌ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

గత కొంతకాలంగా.. పవన్‌కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ మధ్య కోల్డ్‌ వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్‌ చేస్తున్న ‘పుష్ప2’ చిత్రం విడుదలపై రకరకాల ఊహాగానాలు, అనుమానాలు, భయాలు ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకి మనుగడ ఉంటుందా అనే భయం బన్నీ ఫ్యాన్స్‌లో ఉంది. అల్లు అర్జున్‌ విషయాన్ని ఇప్పటివరకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రస్తావించని పవన్‌.. తాజాగా ఈ కామెంట్స్‌ చేయడంతో అందరూ ఆలోచనలో పడ్డారు. చాలా కాలంగా ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొంటూ షూటింగ్‌ జరుపుకుంటున్న ‘పుష్ప2’ చిత్రాన్ని డిసెంబర్‌ 6న విడుదల చెయ్యాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. ఈ తరుణంలో పవన్‌ ఇలాంటి కామెంట్స్‌ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.