English | Telugu

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ కి సమంత హాజరు

మొత్తానికి అక్కినేని నాగచైతన్య(naga chaitanya)ఒక ఇంటివాడవుతున్నాడు. దీంతో అక్కినేని వారి ఇంట్లోనే కాదు అక్కినేని అభిమానుల ఇంట్లో కూడా ఆనందోత్సవాలు వెళ్లి విరుస్తున్నాయి. ఈ రోజు ఉదయమే చైతన్య, శోభిత ధూళిపాళ్ల (sobhita dhulipala)ఎంగేజ్ మెంట్ అతి కొద్దీ మంది బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈ విషయమే టూ డే హాట్ టాపిక్. అంతే కాదు గూగుల్ కి కూడా పని ఏర్పడింది. ఈ క్రమంలో శోభిత సిస్టర్ న్యూస్ తెలిసి అందరు కొత్త రకం షాక్ కి గురవుతున్నారు.

శోభిత ధూళిపాళ్ల చెల్లెలి పేరు సమంత. ఇది నిజం. కావాలంటే మీరే చూడండి .ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి లో శోభిత జన్మించింది. తండ్రి పేరు వేణుగోపాలరావు. ఇండియన్ నావిలో ఉద్యోగం చేసే వాళ్ళు. మదర్ పేరు శాంత కామాక్షి . స్కూల్ టీచర్ గా వర్క్ చేసే వాళ్ళు. ఇక శోభిత కి ఒక సిస్టర్. ఆమె పేరునే సమంత. ఇక సమంత కూడా ఎంగేజ్మెంట్ కూడా హాజరయ్యింది. ఇప్పడు ఈ విషయం సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ గా మారింది. ఎందుకు అంతలా వైరల్ అవుతుందో అందరకి తెలిసిందే. అదే టైం లో చైతు, శోభిత ల ఎంగేజ్మెంట్ పిక్స్ కూడా వైరల్ గా నిలుస్తున్నాయి.

ఇక శోభిత 2013 లో ఫెమినా నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత పలు తెలుగు తమిళ, హిందీ,మలయాళ, ఇంగ్లీష్ సినిమాల్లో నటనకి అవకాశమున్న పాత్రల్ని పోషించి మంచి పేరు సంపాదించింది. అడవి శేషు హీరోగా వచ్చిన గూఢచారి లో కూడా చేసింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.