English | Telugu

చెర్రీ స‌ర్జ‌రీ సీక్రెట్ లీక్ చేశాడు



రామ్‌చ‌ర‌ణ్‌కీ ప్లాస్టిక్ స‌ర్జ‌రీల‌కూ అవినాభావ సంబంధం ఉంది. నాన్ మెగా ఫ్యాన్స్... ఈ విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తుంటారు. అయితే నేను సర్జ‌రీ చేయించుకొన్నా.. అని చ‌ర‌ణ్ ఎప్పుడూ చెప్ప‌లేదు. అయితే ఈ ర‌హ‌స్యాన్ని యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ బ‌య‌ట‌పెట్టేశాడు. ఓ క‌ళాశాల‌లో విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ... చెర్రీ స‌ర్జ‌రీ విష‌యాన్ని బ‌య‌ట‌కు కక్కేశాడు. హీరో అవ్వాల‌ని రామ్‌చ‌ర‌ణ్ స‌ర్జ‌రీలు చేసుకొన్నాడు... అంటూ.. నోరు జారాడు.

ఈ వ్యాఖ్య‌లు మెగా అభిమానుల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. నాన్ మెగా ఫ్యాన్స్ ఈ విష‌యాన్ని హైలెట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో.. పోస్టింగుల మీద పోస్టింగులు చేస్తున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ యండ‌మూరిపై గుర్రుగా ఉన్నారు. ప్రొఫెష‌న‌ల్ సీక్రెట్‌ని బ‌య‌ట‌కు చెప్పేయ‌డం ఏమిటని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చిరు ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుడైన యండ‌మూరి ఈ స‌మ‌యంలో ఈ సీక్రెట్ ఎందుకు బ‌య‌ట‌పెట్టాడో మ‌రి...?


రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.