English | Telugu
సరైనోడు... సరిగా లేదు
Updated : Jan 20, 2016
సినిమా విడుదల వరకూ ఎన్నయినా మార్పులూ, చేర్పులూ చేసుకోవొచ్చు. ఒక్కసారి బయటకు వచ్చాక.. మన చేతుల్లో ఏం ఉండదు. అందుకే రీషూట్లకు కూడా సినిమా వాళ్లు రెడీ అయిపోతున్నారు. రీషూట్ల వరకూ వెళ్లడం ఎందుకు... అదేదో స్ర్కిప్టు దశలోనే సరిచూసుకోవచ్చుగా.. అనిపించింది అల్లు అరవింద్ కి. అందుకే... సరైనోడు స్ర్కిప్టుని దగ్గర పెట్టుకొని దిద్దుతున్నాడట. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో అల్లుఅరవింద్ మరీ పట్టుగా ఉన్నాడట.
బోయపాటి రాసిన క్లైమాక్స్ అరవింద్‌కి నచ్చకపోవడంతో మళ్లీ క్లైమాక్స్ కొత్తగా రాయించాడని టాక్. అంతేకాదు.. సినిమా అంతా ఓసారి చూసుకొని కొన్ని మార్పులు సూచించినట్టు టాక్. అయితే.. అరవింద్ మితిమీరిన జోక్యం.. బోయపాటికి బొత్తిగా నచ్చడం లేదని తెలుస్తోంది. కక్కలేక మింగలేక అన్నట్టుందంట ఆయన పరిస్థితి. ఏదో.. ఈ సినిమాకి ఇలా కానిచ్చేద్దాం అని సర్దుకుపోతున్నాడని తెలుస్తోంది. అరవింద్‌ది బలే బుర్ర.. ఆయన ఏం చేసినా అందులో మీనింగుంటుంది. ఈ సినిమా హిట్టయితే... ఆ క్రెడిట్ అంతా బోయపాటిదే కదా. అందుకే ఈ మాత్రం సర్దుబాట్లు తప్పవు.