English | Telugu
రెండు వారాల ముందే వస్తున్న 'విరాట పర్వం'
Updated : May 30, 2022
ఊహించిందే జరిగింది. 'విరాట పర్వం' సినిమా విడుదల తేదీ మారింది. జూలై 1న విడుదల కావాల్సిన ఈ సినిమాని రెండు వారాల ముందుగా అంటే జూన్ 17న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విరాట పర్వం'. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'నీది నాది ఒకే కథ' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో పాటు.. విభిన్న చిత్రాలు చేసే రానా, సాయి పల్లవి నటిస్తున్న సినిమా కావడంతో 'విరాట పర్వం'పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్లే ఈ మూవీ గ్లింప్స్, టీజర్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. కానీ ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాని జూలై 1 న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు విరాట పర్వం కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి మూవీ టీమ్ మరో బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది. చెప్పిన డేట్ కన్నా ముందుగానే జూన్ 17 నే విడుదల చేస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు. విరాట పర్వం మూవీ ప్రీపోన్ అయ్యే అవకాశముందని నిన్నటి నుంచి వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి.
ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.