English | Telugu

Vidyapati Review : విద్యాపతి మూవీ రివ్యూ

Vidyapati Review : విద్యాపతి మూవీ రివ్యూ

 


మూవీ: విద్యాపతి
నటీనటులు: నాగభూషణ, మలైకా వాసుపాల్, గరుడ రామ్, డాలీ ధనంజయ, తదితరులు
ఎడిటింగ్: ఈషమ్ ఖాన్, హసీన్ ఖాన్
సినిమాటోగ్రఫీ: లావిత్
మ్యూజిక్: డాస్మోడ్
నిర్మాతలు: ధనంజయ, యదునందన్
దర్శకత్వం: ఈషమ్ ఖాన్
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో

కథ:

సిద్దూ(నాగభూషణ) ఫేమస్ హీరోయిన్ విద్య(మలైకా వాసుపాల్) కి భర్తగా జీవిస్తుంటాడు. అలాగే తన మేనేజర్ గా చేస్తుంటాడు.  అందుకే అఙదరు అతనిని విద్యాపతి(vidyapati) అంటారు. అయితే విద్యకి తెలియకుండా నిర్మాతలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు సిద్దూ.  ఇక అతను విలాసవంతమైన  జీవితాన్ని గడుపుతుంటాడు. ఒకరోజున అతను సర్ ప్రైజ్ అంటూ ఓ హోటల్ కి తీసుకెళ్తాడు. కానీ అక్కడ లేట్ అయిందని కిచెన్ క్లోజ్ అయిందని చెప్పడంతో వాళ్లు తిరిగువస్తుంటారు. అదేసనయంలో హీరోయిన్ విద్య వాళ్ళ కార్ డ్రైవర్ కి అడ్డుగా లోకల్ రౌడీ జగ్గూ ( గరుడ రామ్) కార్ వస్తుంది. ‌ఇక ఆ సమయంలో విద్యని జగ్గూ చూస్తాడు. తన దగ్గరికి వచ్చి సెల్ఫీ కావాలంటూ విద్యని ఫిజికల్ గా టచ్ చేస్తుంటాడు. దాంతో జగ్గూని విద్య కొడుతుంది. అలాగే తన భర్త సిద్దూని జగ్గు కొడతాడు. ఇక తనని అవమానించిన జగ్గూని తీసుకొచ్చి అతనితో సారీ చెప్పిస్తేనే, తాము కలిసి ఉండటం జరుగుతుందని సిద్ధూని బయటకు పంపించేస్తుంది. అప్పుడు సిద్ధూ ఏం చేస్తాడు? విద్య కోరికను అతను నెరవేర్చగలిగాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఓ సాధారణ వ్యక్తి సెలెబ్రిటీని పెళ్లి చేసుకోవడంతో అతని లైఫ్ ఎలా మారింది.. ఆ తర్వాత అతను మళ్ళీ ఎందుకు రోడ్డు మీదకి వచ్చాడు.. వాళ్ళిద్దరు మళ్ళీ కలిసారా లేదా అనే పాయింట్ తో ఈ సినిమా కథ సాగుతుంది. మరి ఇది ప్రేక్షకులని మెప్పించిందా అంటే కొంతవరకు ఒకే. కానీ కొన్ని లాజిక్ లెస్ గా ఉండడంతో అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. అయితే ఫస్టాఫ్ కన్విన్సింగ్ అండ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 

సెకెంఢాఫ్ కాస్త స్లోగా సాగినా చివరి ముప్పై నిమిషాలు సినిమా బాగుంటుంది‌. ఇక డాలీ ధనంజయ స్పెషల్ రోల్ సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చింది. ఏ సినిమాలో అయిన హీరో, హీరోయిన్ ప్రధాన పాత్రలు.‌ సో వాటిని చాలా బలంగా చూపించాలి. కానీ దర్శకుడు ఈ సినిమాలో హీరోని పిరికివాడిగా, ధైర్యం లేనివాడిగా, చేతకానివాడిగా చూపించాడు. అది ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.

ఈ సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ మూడు పాత్రలే ప్రధానంగా కనిపిస్తాయి. బాధ్యతల నుంచి భయపడి పారిపోతున్నంతసేపు అవి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. భయపడుతున్నంత కాలం ఈ సమాజం నిన్ను భయపెడుతూనే ఉంటుంది. కష్టపడకుండా ఫలితాన్ని పొందినవారు.. సాధన చేయకుండా విజయాన్ని సాధించినవారు లేరు అనేది ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాడు. హీరోయిన్ కొన్నిసార్లు మాత్రమే కన్పించినా కథ ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. అయితే కొన్ని లాజిక్ లెస్ సీన్లని వదిలేస్తే ఇది పర్వాలేదు. లావిత్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఈషమ్ ఖాన్ఎడిటింగ్ ఒకే. డాస్మోడ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

సిద్దూ అలియాస్ వాద్యాపతిగా నాగభూషణ, విద్యగా మలైకా వాసుపాల్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు‌‌. కెజిఎఫ్ విలన్ గరుడ రామ్ జగ్గు పాత్రలో ఒదిగిపోయాడు. మిగతావారంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. 

ఫైనల్ గా : కొన్ని లాజిక్ లేని సీన్లని వదిలేస్తే వన్ టైమ్ వాచెబుల్.

రేటింగ్ : 2.5 / 5

✍️. దాసరి మల్లేష్