English | Telugu

త్రివిక్రమ్ పట్టుకుంటే కోట్లే..!

టాలీవుడ్‌ మార్కెట్‌ పరిధి ఎంతో అందరికీ తెలిసిందే. రూ.50 కోట్ల మార్కు అందుకుంటే అద్భుతమే అని చెప్పాలి. ఈ ఘనత కూడా అందరు స్టార్‌ హీరోలకూ సాధ్యం కాలేదు. చాలా తక్కువ మంది మాత్రమే కలెక్షన్లలో ఈ మైల్‌స్టోన్‌ను అందుకున్నారు. ఐతే వరుసగా ఒకటికి రెండు సినిమాలు రూ.50 కోట్ల క్లబ్‌లో చేరడమంటే చిన్న విషయం కాదు. టాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక డైరెక్టర్ త్రివిక్రమ్ అనే చెప్పాలి. ఇంతకుముందు ఆయన నుండి వచ్చిన అత్తారింటికి దారేది అంచనాల్ని మించిపోయి ఆడి రూ.80 కోట్ల దాకా వసూలు చేసింది. ఇప్పుడు మళ్ళీ సన్నాఫ్‌ సత్యమూర్తి రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరింది. అత్తారింటికి దారేది సూపర్ టాక్ వచ్చింది కాబట్టి ఆ స్థాయి కలెక్షన్లు రాబట్టడం విశేషమేమీ కాదు. కానీ సన్నాఫ్‌ సత్యమూర్తి డివైడ్‌ టాక్‌ను తట్టుకుని 50 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం గొప్ప విషయమే. దీంతో వరుసగా రెండు రూ.50 కోట్ల సినిమాలిచ్చిన దర్శకుడుగా త్రివిక్రమ్ రికార్డ్ సృష్టించాడు.