English | Telugu

షాకింగ్ : న‌య‌న‌తార పెళ్లి.. గ‌ప్‌చుప్‌గా

ప్రేమ‌, పెళ్లి క‌బుర్ల‌లో న‌య‌న‌తార న‌ల‌గ‌డం కొత్త విష‌యమేమీ కాదు. శింబు, ప్ర‌భుదేవా, ఆర్య‌.. ఇలా ప‌లువురి పేర్లు న‌య‌న‌తార ప్రేమ వ్య‌వ‌హారాల్లో త‌ర‌చూ వినిపించేవి. వీటిపై స‌మాధానం చెప్పీ చెప్పీ న‌య‌న‌కూ విసుగొచ్చేసింది. ఇప్పుడు మ‌రో హాట్ వార్త‌.. షికారు చేస్తోంది. ఈసారి ప్రేమ వ్య‌వ‌హారం కాదు.. ఏకంగా న‌య‌న‌తార పెళ్లే చేసేసుకొంద‌ని చెప్పుకొంటున్నారు. త‌మిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో న‌య‌న్ ప్రేమ‌లో ఉంద‌ని, వీరిద్ద‌రూ కొచ్చిలోని ఓ చ‌ర్చ్‌లో పెళ్లి కూడా చేసేసుకొన్నార‌ని, ఈ పెళ్లికి కేవ‌లం న‌య‌న‌, శివ‌న్‌లకు అత్యంత ఆప్తులే హాజ‌ర‌య్యార‌ని వినికిడి. త‌మిళ‌నాట ఛాన‌ళ్లు, ప‌త్రిక‌లూ అన్నీ... 'న‌య‌న పెళ్ల‌యిపోయింది' అనే విష‌యాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌చురించాయి. ఛాన‌ళ్ల‌లో న‌య‌నే స్పెష‌ల్ ఐటెమ్‌. అయితే ఈ విష‌యంలో న‌య‌న్ నోరువిప్ప‌డం లేదు. ఆమె స‌న్నిహితులు కూడా ఏమీ మాట్లాడ‌డం లేదు. న‌య‌న‌, శివ‌న్ త్వ‌ర‌లోనే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, త‌మ పెళ్లి విష‌యం చెప్పే అవ‌కాశం ఉంద‌ని చెన్నై వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే ప్రేమ వ్య‌వ‌హారంలో రెండుసార్లు మోస‌పోయిన న‌య‌న్‌... ఈసారి అలాంటి త‌ప్పు చేయ‌కుండా పెళ్లి చేసుకొంద‌ని, అన్ని విష‌యాలూ చ‌క్క‌బ‌డ్డాకే మీడియాకు తెలియ‌ప‌రిచే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. చూద్దాం... న‌య‌న ఎప్పుడు నోరు విప్పుతుందో.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.