English | Telugu

మైథలాజికల్ ఫిల్మ్ లో జూనియర్ ఎన్టీఆర్.. పాన్ ఇండియా షేక్ అవ్వడం ఖాయం!

ప్రతి గింజ మీద తినే వాడి పేరు రాసి ఉంటుందంటారు. అలాగే కొన్ని కథలు కొందరి హీరోల పేరు మీద రాసుంటాయి. అవి అటు తిరిగి, ఇటు తిరిగి.. చివరికి ఎవరి దగ్గరికి చేరాలో వారి దగ్గరకే చేరతాయి. తాజాగా ఓ కథ.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దగ్గరకు అలాగే చేరినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో ఓ మైథలాజికల్ ఫిల్మ్ రావాల్సి ఉంది. అయితే బన్నీ.. ముందు ప్రకటించిన త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను కాదని.. అట్లీ ప్రాజెక్ట్ ను మొదట పట్టాలెక్కించాడు. దీంతో త్రివిక్రమ్ సందిగ్ధంలో పడ్డాడు. మొదట అల్లు అర్జున్ కోసం ఎదురుచూడాలని భావించాడు. కానీ, నెలలు గడుస్తున్నా బన్నీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో.. ఇక త్రివిక్రమ్ కూడా తన దారి తాను చూసుకోవాలని డిసైడ్ అయినట్లు వినికిడి. ఈ క్రమంలోనే ఈ పౌరాణిక కథను ఎన్టీఆర్ తో చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ మైథలాజికల్ ఫిల్మ్ ని మొదట ఎన్టీఆరే చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో భారీ మైథలాజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నామని, అది గ్లోబల్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఏం కానీ.. ఈ పౌరాణిక కథ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళింది. ఈ కథను బన్నీ ఎంతగానో ఇష్టపడినప్పటికీ.. ఎందుకనో దీనికంటే ముందు అట్లీ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపాడు. దీంతో ఈ కథ మళ్ళీ ఎన్టీఆర్ నే వెతుక్కుంటూ వచ్చింది.

ఇది కుమారస్వామి కథ అని టాక్. త్రివిక్రమ్ కి పురాణాలపై ఎంతో పట్టుంది. ఆ పట్టుతో అద్భుతమైన కథను సిద్ధం చేశారని అంటున్నారు. పైగా ఇటువంటి కథలకు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పౌరాణిక పాత్రలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరు. గతంలో జూనియర్ ఎన్టీఆర్.. యముడి పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు కుమారస్వామి పాత్రకు ప్రాణం పోస్తాడు అనడంలో సందేహం లేదు.

ఎన్టీఆర్ ఆగస్టులో 'వార్-2' అనే బాలీవుడ్ ఫిల్మ్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ మూవీ లైన్ లో ఉంది. ఈ లెక్కన త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లోకి రావడానికి ఎన్టీఆర్ కి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఈలోగా త్రివిక్రమ్.. వెంకటేష్ తో ఓ సినిమా చేయనున్నాడు. రామ్ చరణ్ తోనూ త్రివిక్రమ్ ఓ సినిమా కమిట్ అయ్యాడు. అది ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి ముందు ఉంటుందా? తర్వాత ఉంటుందా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.