English | Telugu

30 ప్లస్‌లో వర్కవుట్స్ ఎందుకు..?

త్రిష..ఒకప్పుడు సౌత్‌లో టాప్ హీరోయిన్. తన క్యూట్ లుక్స్‌తో తెలుగు, తమిళ ఇండస్ట్రీలను షేక్ చేసిన బ్యూటీ. అయితే కొత్త భామల ఎంట్రీ, ఏజ్ బార్ అవుతుండటంతో త్రిషకు ఆఫర్లు తగ్గడంతో ఇక మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. అందులో భాగంగా మణియప్పన్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. అయితే లక్ కలిసివచ్చి మళ్లీ ఆఫర్లు రావడంతో ఏంగేజ్‌మెంట్ రద్దు చేసుకుంది. అయితే త్రిష చేసిన సినిమాలు పరాజయం పాలవ్వడం.. కెరీర్‌కు చాలా కీలకమైన నాయకి సినిమా ఘోరంగా దెబ్బతినడంతో త్రిష ఫేడ్ అవుట్ అయ్యే స్టేజ్‌ దగ్గరికి వచ్చేసింది. ఈ చెన్నై పొన్ను ఇప్పుడు ఏం చేస్తుందో అని తెలుగు, తమిళ మీడియాలు ఎంత వెతికినా ఎక్కడా త్రిష జాడ కనిపించలేదు.

ఈ క్రమంలో జిమ్ బ్యాక్‌డ్రాప్‌లో సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది త్రిష. అయితే చిక్కంతా అక్కడే వచ్చింది. ఆ ఫోటోని చూసినోళ్లు తెగ భయపడిపోతున్నారు. ఎందుకంటే సినిమాల్లో కోమలంగా, చంద్ర బింబం లాంటి త్రిష ముఖం మేకప్ లేకుండా చూసేసరికి, త్రిష ఏంటి ఇలా ఉంది అని జడుసుకుంటున్నారు. అయినా అప్పుడంటే హీరోయిన్‌గా బిజీ కాబట్టి ఫిగర్ కాపాడుకోవడానికి వర్కవుట్స్ చేసిందంటే అర్థముంది. కానీ 30 ప్లస్‌ హీరోయిన్స్‌లో సీనియర్ అయ్యుండి..చేతిలో ఏ ఆఫర్స్ లేకుండా ఉన్న త్రిషకు అంతగా చెమటోడ్చాల్సిన అవసరం ఏమోచ్చిందో.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.