English | Telugu

లెజెండ్స్ మెచ్చిన సినిమా తెలుగులోకి..

విసారణై..ఒక సినిమా విడుదల కాకముందు..విడుదలైన తరువాత మొత్తం ఇండస్ట్రీ అంతా చర్చించడం అంటే చాలా అరుదనే చెప్పుకోవచ్చు. విడుదలకు ముందే కొన్ని చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు గెలవడమే కాదు..గత ఏడాది మన దేశ జాతీయ అవార్డులూ సొంతం చేసుకుంది. రజినీకాంత్, కమల్‌హాసన్, మణిరత్నం లాంటి లెజెండ్స్ ప్రశంసలందుకున్న ఈ సినిమాను తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు, ప్రముఖ హీరో ధనుష్ నిర్మాతగా, అతడి మిత్రుడు వెట్రిమారన్ తెరకెక్కించాడు. మధురైకి చెందిన ఓ ఆటోడ్రైవర్ తన జీవితంలో ఎదురైన భయానక అనుభవాలతో రాసిన కథ ఆధారంగా వెట్రిమారన్ ఈ సినిమాను రూపొందించారు. అమాయకులైన నలుగురు కుర్రాళ్లను పోలీసులు ఓ కేసులో ఇరికించి చిత్రహింసలు పెట్టే నేపథ్యంలో కథ సాగుతుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సమర్పణలో తెలుగమ్మాయి ఆనంది..మరో తెలుగు నటుడు అజయ్ ఘోష్ ఇందులో కీలకపాత్రలు పోషించారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.