English | Telugu

అన్నా హజారేకి టాలీవుడ్ మద్దతు

తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు అన్నాహజారే "లోక్ పాల్‍" బిల్లు కోసం చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు...తెలుపుతూ ఉన్నారు. అసలు ఈ "లోక్ పాల్" బిల్లంటే ఏమిటి...? ఇదీక అటానమస్ అథారిటీ. అంటే ఒక ప్రత్యేకప్రతిపత్తి కలిగిన బిల్లు. ఈ బిల్లు ప్రకారం ఎటువంటి రాజకీయ నాయకులైనా, ఐ ఎ యస్, ఐ పి యస్ అధికారులైనా.... అంతెందుకు మన దేశంలోని ఎవరైనా సరే ఆదాయానికి మించి ఆస్తులున్నా, ఆదాయపు పన్ను ఎగవేసినా ఈ "లోక్ పాల్" బిల్లు ద్వారా విచారణకు పాత్రులవుతారు.


హీరో సిద్ధార్థ తన ట్విట్టర్ లో ఇలా వ్రాశాడు. " మనకోసం అన్నా హజారే వంటి నాయకుడు నిరాహార దీక్ష చేస్తుంటే నాకు భోజనం చేయాలనిపించలేదు. అందుకనే ఆయనకు మద్దతుగా ఈ రోజు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను.మరి మీరూ...?" అని తన ట్విట్టర్ లో వ్రాసుకున్నాడు.


ప్రముఖ హీరో, నిర్మాత, మీదు మిక్కిలి విద్యాదాత అయిన కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు తిరుపతిలోని తన శ్రీ విద్యా నికేతన్ విద్యార్థులతో అన్నా హజారేకు మద్దతుగా ఒక నిశ్శబ్ద ర్యాలీని నిర్వహిస్తూ ఈ ర్యాలీలో పాల్గొనవలసినదిగా ప్రజలందరికి మనవి చేశారు.


అదే విధంగా యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ లో " హలో మై ఫ్రెండ్స్ అన్నా హజారేకు మద్దతు పలకండి. కామతి వంతమైన, అవినీతి రహిత రేపటి భారత దేశం కోసం అన్నా హజారేతో గోంతు కలపండి.జైహింద్" అని వ్రాసి అన్నా హజారేకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.


అన్నా హజారే చేస్తున్న పోరాటానికి అపజయమెరుగని యువ డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి తన బలమైన మద్దతు ప్రకటిస్తూ " ఇది భారతదేశ చరిత్రలో అవినీతి అంతానికి ప్రారంభం మాత్రమే, మనమంతా అన్నా హజారేకి మద్దతు తెలుపుదాం" అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.


ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ధర్నా పార్క్ వద్ద అన్నాహజారేకి మద్దతుగా ఇందిరా పార్క్ కి ఆపోజిట్ గా ఉన్న ధర్నా చౌక్ లో జనం చేయబోయే ధర్నాలో స్వచ్చందంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా " డబ్భై యేళ్ళ వయసులో ఆయన లోక్ పాల్ బిల్ కోసం నిరాహార దీక్ష చేస్తున్నారంటే అది తన కోసం కాదు. తన మాతృదేశంలో రాబోయే తరం అవినీతిరహిత భారతంలో బ్రతకాలనే ఆయన ఈ దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా నేను "లోక్ పాల్" బిల్లు కోసం ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్షలో, ధర్నాలో పాల్గొంటున్నాను.


వీరే కాక ఇంకా మురళీ మోహన్, ప్రకాష్ రాజ్, సింగర్ అనుజ్ గుర్వారా, శ్రియ శరణ్‍, అమీర్ ఖాన్, ఇషా కొప్పీకర్, ఫర్హాన్ అక్తర్, నేహా ధూపియా, ఇకి మన హీరో దగ్గుబాటి రానా అయితే అన్నా ఏకంగా " హజారే మోడ్రన్ గాంధీ లా పోరాడుతున్నారు...మరి మోడ్రన్ నెహ్రూ ఎవరు...?" ప్రశ్నించారు.


అన్నా హజారే పోరాటం మీ కోసం, నాకోసం, మనందరి కోసం, మన దేశం బాగు కోసం. మన దేశంలోని అవినీతిని అంతం చేయటం కోసం. కనుక ఆయనకు మద్దతు తెలిపి, ఆయన పోరాటంలో పాలుపంచుకోవటం ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత. రండి.... అన్నా హజారే పోరాటంలో చేయికలపండి......

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.