English | Telugu

ఏప్రెల్ 25 న రామ్ చరణ్ రచ్చ ప్రారంభం

ఏప్రెల్ 25 న రామ్ చరణ్ రచ్చ ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యువ హీరో రామ్ చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రచ్చ". ఈ చిత్రం ఏప్రెల్ 25 వ తేదీన ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం గత కొంత కాలంగా రామ్ చరణ్ అమెరికాలో ఫ్లోరిడా సమీపాన కల మియామి బీచ్ వద్ద ఉన్న అంతర్జాతీయ జిమ్ లో "రచ్చ" చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.


ఈ "రచ్చ" చిత్రం ప్రారంభోత్సవానికి ఏప్రెల్ పదవ తేదీన ఇండియా రానున్నాడు. ఈ "రచ్చ" చిత్రంలో రామ్ చరణ్ టోటల్ గా తన లుక్ మొత్తం మార్చుకుంటున్నాడట. చాలా స్లిమ్ గా, కండలు తిరిగిన శరీరంతో కనబడుతూ, యాక్షన్ సీన్లలో స్పీడ్ ని ఇంకా పెంచే విధంగా అమెరికాలో శిక్షణ సాగిందని సమాచారం. ఈ "రచ్చ" చిత్రం కథ కూడా విభిన్నంగా, మాస్ ని ఆకట్టుకునే విధంగా, పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో పూర్తి పక్కా మాస్ చిత్రంగా రూపొందనుందట.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.