English | Telugu

ఎ.యస్.రవికుమార్, కళ్యాణ్ రామ్ ల రుద్రాక్ష

ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో, కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న "రుద్రాక్ష" చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. వివరాల్లోకి వెళితే యన్.టి.ఆర్.ఆర్ట్స్ పతాకంపై గతంలో అనేక చిత్రాలను నిర్మించిన యువ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తమ బ్యానర్ లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ రవికుమార్ చౌదరి గతంలో "మనసుతో" అనే ఫ్లాప్ చిత్రంతో దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, "యజ్ఞం" చిత్రంతో విజయాన్ని చూసి, "వీరభద్ర" చిత్రంతో దారుణమైన ఫ్లాప్ ని బాలయ్యకిచ్చాడు.


అంతటితో ఆగకుండా "ఆటాడిస్తా", "ఏం పిల్లో ఏం పిల్లడో" అంటు మరో ఫ్లాప్ లనిచ్చాడు. అటువంటి రవికుమార్ చౌదరి మరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న "రుద్రాక్ష" సినిమాకు ఎంతవరకు న్యాయం చేయగలడో కాలమే చెప్పాలి. అన్నట్టు ఈ "రుద్రాక్ష" చిత్రంలో నిజజీవితంలో తండ్రీ కొడుకులైన టైగర్ నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్ ఈ "రుద్రాక్ష" చిత్రంలో కూడా తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారని సమాచారం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.