English | Telugu

ఆకట్టుకుంటున్న 'ది బ‌ర్త్‌డే బాయ్' టైటిల్ గ్లింప్స్!

ఇప్పుడు రొటీన్ క‌థ‌ల‌కు కాలం చెల్లింది. అందుకే ఇప్పుడు కొత్త వాళ్లు కొత్త కంటెంట్‌తో వైవిధ్య‌మైన అప్రోచ్‌తో సినిమాలు తీస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అదే కోవ‌లో మ‌రో విభిన్న‌మైన ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌ క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం 'ది బ‌ర్త్‌డే బాయ్‌'. బొమ్మ బొరుసా ప‌తాకంపై నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఇద్ద‌రూ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న ఫ‌న్ని సంభాష‌ణ‌తో ఈ టైటిల్ గ్లింప్స్ ప్రారంభ‌మై చిత్రంలో పాత్ర‌ల‌ను ప‌రిచయం చేస్తూ ఓపెన్ అవుతుంది.

ద‌ర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ.. "ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఎం.ఎస్ చ‌ద‌వ‌డానికి విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఐదుగురు చిన్న‌నాటి స్నేహితుల‌కు జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఈ సినిమా స‌హ‌జ‌త్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండ‌బోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి ప్ర‌య‌త్నించాం. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం వుంది" అన్నారు.

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా సంకీర్త్ రాహుల్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ గా ఏఆర్ వంశీ.జి, ఎడిట‌ర్‌ గా న‌రేష్ ఆడుపా వ్యవహరిస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.