English | Telugu

పవన్ కళ్యాణ్ ది షాడో షెడ్యూల్ ప్రకారమే- శోభు యార్లగడ్డ

పవన్ కళ్యాణ్ "ది షాడో" షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని శోభు యార్లగడ్డ తెలిపారు. వివరాల్లోకి వెళితే సంఘమిత్ర, అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారాజేన్ దియాస్ హీరోయిన్ గా, అడవి శేష్, అంజలి లావణ్య మరో జంటగా నటిస్తూండగా, ప్రముఖ తమిళదర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ది షాడో". మాఫియా బ్యాక్ డ్రాప్ లో తయారైన కథతో నిర్మిస్తున్న సినిమా పవన్ కళ్యాణ్ "ది షాడో". పవన్ కళ్యాణ్ "ది షాడో" సినిమాని కొంత భాగం రీషూట్ చేశారని వినపడింది.

రాజమౌళి కలకత్తా కాళికాలయానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ "ది షాడో" షూటింగ్ కి వెళ్ళి చూశాడట. అప్పు అతనేవో కొన్ని సూచనలిచ్చాడట. అందుకని పవన్ కళ్యాణ్ "ది షాడో" సినిమాని రిషూట్‍ చేస్తున్నారనీ, అందుకే పవన్ కళ్యాణ్ "ది షాడో" సినిమా ఆలస్యమవుతుందనీ వినపడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ "అదంతా అబద్ధం. మా సినిమా దిషాడో అనుకున్న షెడ్యూల్ ప్రకారమే చాలా బాగా జరుగుతూందని" ట్వీట్ చేశారు. ఈ పవన్ కళ్యాణ్ "ది షాడో" సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్నందిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.