English | Telugu

నాగ్ కళ్యాణ్ జ్యూయలర్స్ యాడ్ షూటింగ్ రేపే

నాగ్ కళ్యాణ్ జ్యూయలర్స్ యాడ్ షూటింగ్ రేపే ప్రారంభం కానుంది. వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన కళ్యాణ్ రామ్ జ్యూయలర్స్ సంస్థ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా, యువసామ్రాట్, అక్కినేని నాగార్జునను ఎంచుకుంది. ఇప్పటికే కళ్యాణ్ జ్యూయలర్స్ సంస్థ ఒక యాడ్ ని నాగార్జునతో షూట్ చేసి తమ నగల అమ్మకాలకు పబ్లిసిటీ జరుపుకుంటోంది. ఆ యాడ్ బాగా వర్కవుట్ కావటంతో నాగార్జునతో మరో యాడ్ ను కూడా ఆకర్షణీయంగా తయారుచేసి, మొత్తం సౌతిండియన్ మార్కెట్ ను తమ చేతుల్లోకి తీసుకోటానికి సన్నాహాలు చేస్తూంది.

ఆ ప్రయత్నంలో భాగంగా రేపు అంటే జూన్ 9 వ తేదీన తమిళనాడులోని పళనిలోకల శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో అక్కినేని నాగార్జునతో కొత్త యాడ్ ను చిత్రీకరించనుంది. ఈ యాడ్ లో నటించిన అనంతరం తను హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న "రాజన్న" సినిమా షూటింగ్ లోనూ, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం "ఢమరుకం"లోనూ నాగార్జున షూటింగులో పాల్గొంటారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.