English | Telugu

సినిమా గొప్పదా రాజకీయం గొప్పదా అంటున్న ప్రజలు!

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులు అవ్వడంతో పాటుగా కట్టుబట్టలతో రోడ్ మీద నిలబడ్డారు. కొన్ని ఏరియాలలో అయితే చనిపోయారు కూడా. అందుకు సంబంధించిన వార్తలు పలువురిని కంటతడి పెట్టిస్తుంది.ఇందుకు సినిమా తారలు మినహాయింపు కాదు. వరద బాధితులకి తమ సానుభూతిని తెలియచేస్తూ మీకు మేమున్నాం అంటూ భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా సరికొత్త చర్చ జరుగుతుంది.

చిరంజీవి దగ్గర నుంచి మొదలుకొని బాలకృష్ణ,మహేష్ బాబు, ప్రభాస్,ఎన్టీఆర్, బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, త్రివిక్రమ్, అశ్వనీదత్, సితార ఎంటర్ టైన్మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,వెంకీ అట్లూరి , అనన్య నాగళ్ళ ఇలా హీరోల దగ్గరనుంచి నిర్మాతలు దర్శకులు, నటీమణుల దాకా అందరు కష్టాల్లో ఉన్న తెలుగు వారిని ఆదుకోవడానికి కోట్ల రూపాయలని విరాళంగా ఇస్తున్నారు. మరి కొంత మంది ఇదే బాటలో ఇవ్వబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా సిఎం సహాయనిధికి కోటి రూపాయలని ప్రకటించాడు. మరి రాజకీయనాయకులు ఎందుకు ఇలాంటి సమయాల్లో విరాళాలు ప్రకటించరని పలువురు చర్చించుకుంటున్నారు.

ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీకు మేమున్నాం. ప్రజలకి సేవ చెయ్యడానికే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పే రాజకీయనాయకులు సినిమా వాళ్ళల్లా క్యూ కట్టి ఎందుకు ఆదుకోరని అంటున్నారు. కొంత మంది స్థానిక రాజకీయనాయకులు వరద బాధితుల కోసం పలు రకాలుగా సాయం చేస్తున్నా కూడా, నేడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు, పదవుల్ని అనుభవించిన వాళ్లు, ఎందుకు సినిమా వాళ్ళల్లా ప్రజలని ఆదుకోవడానికి ముందుకు రారని చర్చించుకుంటున్నారు. ఇక కరుడు కట్టిన సినీ అభిమానులు అయితే సినిమా ఎప్పుడు కూడా గొప్పదే అని అంటున్నారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.