English | Telugu
ఎమ్మెస్ నారాయణకు అస్వస్థత
Updated : Jan 20, 2015
తెలుగు సినిమా ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైద్రాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన అనారోగ్యానికి కారణం ఫుడ్ పాయిజనింగ్ అని తెలుస్తోంది. ఎమ్మెస్ నారాయణ భీమవరంలో సంక్రాంతి పండుగ జరుపుకొనేందుకు వచ్చినప్పుడు స్థానిక హోటల్లో ఆహారం తీసుకొన్న తరువాత ఫుడ్ పాయిజనింగ్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. అది గమనించిన సన్నిహితులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన గత కొంత కాలంగా కిడ్నీ మరియు గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.