English | Telugu

దర్శకుడు తేజకు పుత్ర వియోగం

దర్శకుడు తేజకు పుత్ర వియోగం కలిగింది. వివరాల్లోకి వెళితే గతంలో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై, రామోజీరావు నిర్మించగా సెన్సేషనల్ హిట్టయిన "చిత్రం"సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి దర్శకుడుగా ప్రవేశించారు కెమెరామేన్ తేజ. ఆ తర్వాత నితిన్ హీరోగా "జయం", ఉదయ్ కిరణ్ హీరోగా "నువ్వూ-నేను", మహేష్ బాబు హీరోగా "నిజం", నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా "లక్ష్మీ కళ్యాణం" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. హీరో ఉదయ్ కిరణ్ హీరోయిన్లు రీమా సేన్, కాజల్ అగర్వాల్, హాస్యనటుడు సుమన్ శెట్టి వంటి తారలను దర్శకుడు తేజానే సినీ పరిశ్రమకు పరిచయం చేశారు.

అటువంటి దర్శకుడు తేజ కుమారుడు పుట్టిన దగ్గరనుండీ డాక్టర్లకు అంతుపట్టని ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతుండేవాడట. మనదేశంలోనే కాక ఆ పసివాడికి విదేశాల్లో సైతం వైద్యం చేయించారు దర్శకులు తేజ. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరికి మూడేళ్ళ వయసున్న ఆ బాబు మరణించటం జరిగింది. ఆ బిడ్డ మరణాన్ని తట్టుకునే ధైర్యం తేజకు ఆ భగవంతుడివ్వాలని ఆశిస్తూ, తేజ కుటుంబానికి తెలుగువన్ తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతోంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.