English | Telugu

మంచు వారి వేడుకలో తాప్సి సందడి

ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ కుమార్ నిశ్చితార్ధం వేడుకలో ప్రముఖ హీరోయిన్ తాప్సి హల్ చల్ చేసింది. మంచు వారి ఇంటి హీరోయిన్ గా పేరు పడ్డ తాప్సి తన సగం సినిమాలు మోహన్ బాబు కుమారులు మనోజ్, విష్ణులతోనే చేసింది. ఇక వారి కుటుంబంతో కూడా ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్క్ హయాత్ లో వేడుకలకు హాజరయిన తాప్సి శ్వేత వర్ణ దుస్తులతో మనోజ్ సోదరి మంచు లక్ష్మితో కలిసి అతిథుల మధ్య సందడి చేసింది. వచ్చిన అతిథులలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.