English | Telugu
చరణ్ కొట్టడానికి అతన్ని సెలెక్ట్ చేశాడు
Updated : Jul 13, 2015
రామ్ చరణ్- శ్రీను వైట్ల కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వార ఓ కొత్త విలన్ టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. ఆయనే అరుణ్ విజయ్. ఎంతవాడుగానీ సినిమాలో అజిత్ తో సమంగా పెర్ ఫార్మ్ చేసి, శభాష్ అనిపించుకున్నాడు. అంతేకాదు ఇతగాడు మల్టీ టాలెంటెడ్. సింగర్, స్టంట్ కో ఆర్డినేటర్. అందుకే ఇప్పుడ రామ్ చరణ్ కన్ను ఇతగాడి మీద పడిందని టాక్. దాంతో చరణ్ సినిమాకి విలన్ కోసం సంప్రదించడం, అందుకు అరుణ్ ఓకే చెప్పేయడం జరిగిపోయింది. ప్రస్తుతం అరుణ్ కు సంబధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.