English | Telugu
వర్మ చుట్టిన మరో సినిమా...
Updated : Feb 11, 2015
మంచి నీళ్లు తాగినంత ఈజీగా సినిమా తీసేస్తాడు వర్మ. సారీ... వర్మ అనేసరికి వాడ్కా తాగినంత ఈజీగా అనాలేమో. 5 రోజుల్లో సినిమా తీసి కాలర్ ఎగరేశాడు వర్మ. ఆ సినిమా ఏమైందో అందరికీ తెలిసిన విషయమే. ఏ పనీ లేనట్టే కనిపిస్తూ.. సినిమాల్ని తెగ చుట్టేస్తుంటాడు. ఓ ఇల్లు, కెమెరా, కనిపించడానికి నలుగురైదుగురు ఆర్టిస్టులు ఉంటే చాలు.. సినిమా రెడీ అయిపోతుంది. అలాంటి మరో సినిమా చుట్టేశాడు వర్మ. అదే.. 365 డేస్. 3 ఆర్టిస్టులతో 6 రోజుల వ్యవధిలో 5 లక్షల్లో ఈ సినిమా తీసేశాడేమో. ఆ పేరు పెట్టాడు. అన్నట్టు ఇదో లవ్ స్టోరీ అట. మాఫియా, దెయ్యం,సినిమా గోల ఇవేం ఈ సినిమాలో కనిపించవ్ అంటున్నాడు వర్మ. పెళ్లి తరవాత ప్రేమ ఎలా ఉంటుంది? అనే పాయింట్‌ని టచ్ చేశా అంటున్నాడు వర్మ. ప్రేమపై వర్మ అభిప్రాయాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆ పదాన్ని ఇంకెంత రాక్షసంగా చూపిస్తాడో మరి. ఫిబ్రవరి 14న ఈ సినిమాకు సంబంధించిన పాటల్ని, ట్రైలర్ నీ విడుదల చేస్తాడట. మచ్చుక్కి ఓ టీజర్ చూపించాడు. అది హీరోయిన్ తడిపొడి దుస్తులతో రసవత్తరంగా ఉంది. సినిమా కూడా ఇదే తరహాలో ఉంటే.. యూత్‌కి కనెక్టయిపోతుందేమో..? మరి వర్మ తీసిన ఈ కళాఖండం చూడ్డానికి మీరూ రెడీ అయిపోండి.