English | Telugu
బెంగాళీ నటి ఆత్మహత్యా ? ప్రమాదమా ?
Updated : May 27, 2014
బెంగాళీ నటి స్వస్తికా ముఖర్జి ఆత్మహత్యా యత్నం చేశారంటూ వార్తలు వచ్చాయి. అవన్నీ పుకార్లేనని పార్టీ జరుగుతుండగా ప్రమాదానికి ఆమె ప్రమాదానికి గురైందని సోషల్ మీడియా ద్వారా ఆమె టీం సభ్యులు చెప్రున్నారు. బెంగాళీ హీరోయిన్ అయిన స్వస్తికా ముఖర్జీ పార్టీ జరుగుతుండగా కింద పడిపోవడం వల్ల ఆమె ఎడమ భుజానికి, చేతికి గాయాలు అయ్యాయి.ఆమెను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. శనివారం నాడు ఆమెకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. ఆమె భుజంలో గుచ్చుకున్న గాజు పెంకులు సర్జరీ ద్వారి తొలగించారు. అయితే ఇవి ఎలా ఆమె భుజానికి గుచ్చుకున్నాయో తెలియడంలేదన్నారు. అయితే ఆమె పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉండటంతో ఆమెను ఆదివారం డిశ్చార్జ్ చేశామని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ కౌశిక్ తెలిపారు.
అయితే ఇది ఒక వేపు వుండగా, బెంగాళీ సినిమా వర్గాల్లో ఇది ఆత్మహత్యా యత్నమే అంటూ మాట్లూడుకుంటున్నారట. స్వస్తిక భర్త నుంచి విడిపోయింది. మానసికంగా అశాంతితో స్వస్తిక ఉండేదని, ప్రస్తుతం ఆమె బాయ్ ఫ్రెండ్‌తో గొడవపడటం వలన ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ విషయంలో విచారణ జరుపుతున్న పోలీసులు, ఆసుపత్రి వర్గాలతో మాట్లాడిన తర్వాత, యాక్సిడెంటల్‌గా జరిగినందు వల్లే ఆమెకు గాయాలు అయ్యాయని వారికి అర్థమయిందని అన్నారు. అలాగే వారికి ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అందువల్ల కేసు నమోదు చేయలేదని తెలిపారు.
ఆమె సోదరి అజోపా ముఖర్జీ ఈ విషయం గురించి వివరిస్తూ, స్వస్తికా పార్టీ జరుగుతున్నప్పుడు చేతిలో గాజు గ్లాసు పట్టుకుని ఉందని, సడెన్‌గా కిందపడటంతో ఆ గ్లాసు పగిలి ఆ ముక్కలు ఆమెకు గుచ్చుకుని ఉంటాయన్నారు. ఆ సమయంలో స్వస్తిక తలకు, చేతులకు గాయాలైయ్యాయని చెప్పింది. ఈ సంఘటనతో ఆమె నిజంగా ఆత్మహత్యకు పాల్పడిందా, లేక ప్రమాదవశాత్తు ఇదంతా జరిగిందా అనే విషయం అర్థంగాక ఆమె అభిమానులు తికమక పడుతున్నారు. అనేక బెంగాళీ చిత్రాలతో పాటు ముంబయి కట్టింగ్ అనే హిందీ చిత్రంలో స్వస్తికా ముఖర్జీ నటించింది. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటిస్తున్న హిందీ చిత్రంలో కూడా ఆమెకు అవకాశం లభించింది.