English | Telugu

యంగ్ టైగర్ తో సన్నీలియోన్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాలో స‌న్నీలియోన్ తో ఐటెం సాంగ్ చేయించాలనే ఆలోచనలో వున్నాడట పూరి జ‌గ‌న్నాథ్. బాలీవుడ్‌లో హీరోయిన్ కం ఐటం గాళ్‌గా హీటేక్కిస్తున్న సన్నీ ఫస్ట్ టైం తెలుగులో మంచు మనోజ్ " కరెంట్ తీగ "లో ఓ సాంగ్ చేసింది. ఈ సినిమాలో సన్నీ చేసిన ఐటంసాంగ్ ఎలా ఉందో చూడాలని మనోజ్‌ను పూరి అడిగాడట. మిగిలిన భాషల సినిమాల్లో సన్నీ ఎలా వుంటుందో తెలియంది కాదు. కానీ తెలుగులో నేటివిటీకి దగ్గరగా వుందో లేదో చూడాలని అనుకుంటున్నాడట పూరి.ఈ పాటలో స‌న్నీ పెర్‌ఫార్మెన్స్‌ని బ‌ట్టి.. ఎన్టీఆర్ తో ఐటెమ్ సాంగ్ ఛాన్స్ ఇవ్వలా లేదా అనేది డిసైడ్ చేస్తాడట.