English | Telugu

శ్వేతబసుకి దీపికాపదుకునె మద్దతు

వ్యభిచారం కేసులో దొరికిపోయిన శ్వేతబసుకు బాలీవుడ్ అండగా నిలుస్తోంది. బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనే శ్వేతాకు ఫుల్ సపోర్ట్ చేస్తోంది. శ్వేతా ఘటనపై దీపికా మాట్లాడుతూ.. తన కుటుంబాన్ని పోషించుకునేందుకే ఈ బాట పట్టానన్న శ్వేత అదొక్కటే మార్గం అని భావించినట్లయితే అందులో తప్పేముందని ప్రశ్నించింది. అసలు ‘శ్వేతా బసు సెక్స్ స్కాండల్…’ అంటూ మాట్లాడటం అర్థరహితమని, తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని దీపిక కోరింది. దీపికా.. బాటలోనే మరికొద్ది మంది ముద్దుగుమ్మలు శ్వేతకు సపోర్ట్ చేసేందుకు రెడీగా వున్నట్లు సమాచారమ్.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.