English | Telugu
నాన్నకు ప్రేమతో...లెక్కల మాస్టారి కొత్త లెక్క
Updated : Jan 22, 2016
గతంలో యాభై రోజులు ఆడిన సినిమాకు మైలేజ్ పెంచడం కోసం ఆ తర్వాత కొత్త సీన్స్ యాడ్ చేసేవారు...ఇప్పుడు యాభై రోజులు, వంద రోజులు పోయాయి...కేవలం కలెక్షన్స్ మీదే ఇప్పటి మూవీస్ బేస్ అవుతున్న నేపథ్యంలో, లెక్కల్ని మరికాస్త ముందుకు జరపడం కోసం ప్లాన్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు..ఈ లిస్ట్ లో ఇప్పుడు నాన్నకు ప్రేమతో చేరింది...
ఎన్టీయార్ 25వ సినిమాగా,ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ, సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి అడుగుపెట్టింది..సినిమా ప్రేక్షకులకు ఈజీగా రీచ్ కావాలనే ఉద్దేశ్యంతో,కొన్ని ఇంట్రస్టింగ్ సీన్స్ ను కూడా సుకుమార్ నిర్దాక్షిణ్యంగా తీసేశాడట..ఇప్పుడు హిట్ టాక్ తో నడుస్తున్న తన సినిమాకు,ఈ సీన్స్ యాడ్ చేస్తే,రిపీట్ ఆడియన్స్ తో పాటు,కలెక్షన్ మైలేజ్ కూడా యాడ్ అవుతుందనే ఒపీనియన్ లో ఉన్నాడట సుకుమార్..శనివారం నుంచే ఈ సీన్ యాడ్ అవబోతోంది..ఈ సీన్ యాడ్ చేసిన తర్వాత సినిమా నిడివి దాదాపు మూడుగంటలకు చేరుకుంటుందని టాక్...