English | Telugu

శుభం మూవీ రివ్యూ 

తారాగణం: హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, శ్రావణి, వంశీధర్ గౌడ్, అతిథి పాత్రలో సమంత
సంగీతం: క్లింటన్ సెరెజో
నేపథ్య సంగీతం: వివేక్ సాగర్
డీఓపీ: మృదుల్ సుజిత్ సేన్
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
రచన: వసంత్ మారింగంటి
దర్శకత్వం: ప్రవీణ్‌ కండ్రేగుల
నిర్మాత: సమంత
బ్యానర్: ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్
విడుదల తేదీ: మే 9, 2025

స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన మొదటి చిత్రం 'శుభం'. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ ఫిల్మ్.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా మెప్పించిందా? నిర్మాతగా సమంతకు శుభారంభాన్ని ఇచ్చిందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Subham Movie Review)

కథ:
శ్రీను(హర్షిత్ మల్గిరెడ్డి) ఊళ్ళో కేబుల్ టీవీ నెట్ వర్క్ నడుపుతుంటాడు. పెళ్లి చూపుల్లో వల్లి(శ్రియ కొంతం)ని చూసి మనసు పారేసుకున్న శ్రీను.. ఇంట్లోవాళ్ళు వద్దంటున్నా పట్టుబట్టి మరీ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. అమాయకుడు, మంచివాడైన శ్రీనుతో.. భార్య దగ్గర కఠినంగా ఉండాలని అతని ఫ్రెండ్స్ చెబుతారు. అయితే మొదటి రాత్రే శ్రీనుకి ఊహించని షాక్ తగులుతుంది. జన్మజన్మల బంధం అనే సీరియల్ చూడటం కోసం వల్లి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. ఆ సీరియల్ వచ్చే టైంలో డిస్టర్బ్ చేస్తే మొగుణ్ణి కూడా ఊరుకోదు. దెయ్యం పట్టినట్టుగా మారిపోతుంది. వల్లితో పాటు శ్రీను ఫ్రెండ్స్ భార్యలు, ఊరిలోని మిగతా మహిళలు కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు. అసలు ఆ ఊరిలో ఏం జరుగుతోంది? సీరియల్ కోసం మహిళలు దెయ్యాల్లాగా ఎందుకు మారిపోతున్నారు? ఈ సమస్య నుంచి వారు బయటపడగలిగారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
హారర్ కామెడీ జానర్ కి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అక్కడక్కడా భయపెడుతూ, బాగా నవ్విస్తే చాలు.. సినిమాకి ఆదరణ లభిస్తుంది. అందుకే సమంత నిర్మాతగా తొలి అడుగు ఈ జానర్ తో వేసినట్లుంది. అయితే సీరియల్ తో ముడిపెడుతూ హారర్ కామెడీ జానర్ లో సినిమా చేయాలన్న ఆలోచన బాగానే ఉంది. కానీ, ఆ ఆలోచనను తెరమీదకు ఆసక్తికరంగా తీసుకురావడంలో మాత్రం తడబడ్డారు. సీరియల్ కాన్సెప్ట్ ని తీసుకోవడమే కాదు, సినిమాని కూడా సీరియల్ లా సాగదీశారు. కథనంలో బలం లేదు. పాత్రల పరిచయ సన్నివేశాలతో నెమ్మదిగా సినిమాని మొదలుపెట్టి, అసలు కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నారు. మెయిన్ స్టోరీలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా.. కథనంలో వేగం లేదు. చాలా సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం మెప్పిస్తుంది. సెకండాఫ్ లో అసలు పాయింట్ రివీల్ అయిన తర్వాత.. మళ్ళీ సాగదీత ధోరణిలోనే సినిమా నడుస్తుంది. ఓ రకంగా ఈ స్టోరీ లైన్ అనేది షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, వెబ్ సిరీస్ కి తక్కువ అన్నట్టుగా ఉంది. పాయింట్ చిన్నది కావడంతో.. కథ అక్కడక్కడే తిరుగుతూ కొన్ని చోట్ల విసుగు తెప్పిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
నటీనటులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేయలేకపోయారు. సమంత క్యామియో కూడా అంత ఎఫెక్ట్ చూపలేకపోయింది. రచన తేలిపోయింది. ఇలాంటి చిన్న పాయింట్ ని తీసుకున్నప్పుడు.. ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలతో మ్యాజిక్ చేయగలగాలి. సీన్స్ బాగా రిపీట్ కావడంతో.. అటు హారర్ పరంగానూ, ఇటు కామెడీ పరంగానూ ఏదీ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. సాంకేతికంగా సినిమా పరవాలేదు. సంగీతం, కెమెరా పనితనం బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా..
సీరియల్ కాన్సెప్ట్ తో రూపొందిన శుభం.. సీరియల్ తరహాలోనే సాగదీతగా నడిచింది. అటు భయపెట్టడంలోనూ, ఇటు నవ్వించడంలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

రేటింగ్: 2/5

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.