English | Telugu

కుర్రాడికి పోజులెక్కువే సుమీ..!

ఒక సినిమా చేశారో లేదో.. స్టార్స్ అయిపోతుంటారు కొంత‌మంది. సెల‌బ్రెటీ హోదా వ‌చ్చేసిన‌ట్టు.. తామేం చేసినా చెల్లుబాటు అయిపోయిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అల్లుడు శ్రీ‌ను - బెల్లంకొండ శ్రీ‌నివాస్ కూడా ఆ టైపే అనిపిస్తోంది. చేసింది ఒక సినిమా.. రెండో సినిమా విడుద‌ల అవుతోంది.. ఇంత‌లోనే స్టార్‌లా కాల‌ర్ ఎగ‌రేస్తున్నాడు. స్పీడున్నోడు చేస్తున్న‌ప్పుడు భీమినేని శ్రీ‌నివాస‌రావుతో ముప్పు తిప్ప‌లు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగించాడ‌ట‌. మార్పులూ, చేర్పులూ, కాస్ట్యూమ్స్ విష‌యంలో శ్రీ‌ను.. చాలా ఇబ్బంది పెట్టాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ కోడై కూస్తోంది. అంతేకాదు.. గురువారం ప్రెస్‌మీట్‌కీ గంట‌న్న‌ర ఆల‌స్యంగా వ‌చ్చి మీడియాకూ షాక్ ఇచ్చాడు.

సినిమా సినిమాకీ బ‌డ్జెట్ పెరిగిపోతోంది.. తిరిగి రాబ‌ట్టుకోవ‌డం క‌ష్టం క‌దా? అని అడిగితే ' తొలి సినిమాకి రూ.40 కోట్లు పెడితే.. రెండో సినిమా రూ5 కోట్ల‌తో చేయ‌లేను క‌దా. బ‌డ్జెట్ పెంచుకోవ‌డం త‌ప్పేంటి? తిరిగి వ‌చ్చేస్తాయి క‌దా..' అని రివ‌ర్స్‌లో స‌మాధానం చెబుతున్నాడు. అంటే ఈ బాబుకి ప‌దో సినిమాకి వ‌చ్చేస‌రికి రూ.200 కోట్ల పెట్టుబ‌డి పెట్టాలేమో..?? ' స్పీడున్నోడు' అని సినిమాకి పేరు పెట్టుకొంటే చాలు.. ఇలా స్పీడు స్పీడుగా బడ్జెట్‌పెంచుకొంటూ పోతే... నిర్మాత‌లు బొక్క‌బోర్లా ప‌డ‌తారు బాబూ.. ఈ సంగ‌తి గుర్తెట్టుకో మ‌రి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.