English | Telugu
నా గుండె ముక్కలైంది.. సమంత ఎమోషనల్ పోస్ట్!
Updated : Aug 8, 2024
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ తాజాగా జరిగింది. దీంతో చైతన్య మాజీ భార్య, ప్రముఖ హీరోయిన్ సమంత దీనిపై ఏమైనా పరోక్షంగా స్పందిస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమంత ఊహించని విధంగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్ చైతన్య గురించి కాదు. ఒలింపిక్స్ లో ఫైనల్ కి వెళ్లిన ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనూహ్యంగా 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె రిటైర్ మెంట్ ని ప్రకటించింది. దీనిపై ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించిన సమంత.. హార్ట్ బ్రేక్ అయిన ఎమోజీని పోస్ట్ చేసింది.