English | Telugu

తండ్రికి దూరమైన శృతిహాసన్

కమల్ హాసన్ ప్రస్తుతం "ఉత్తమ విలన్" చిత్రంలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో తండ్రి కూతుళ్ళ మధ్య కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అందుకోసం కమల్ తన కూతురు పాత్రను వేరే ఎవరితో చేయించడం ఎందుకని శృతిని సంప్రదించారు. కానీ శృతి వరుస సినిమాలతో బిజీగా ఉంది. పైగా తన డేట్స్ ఇదివరకే వేరే చిత్రానికి కేటాయించడంతో 'ఉత్తమ విలన్' సినిమా కోసం తన డేట్స్ ను సర్దుబాటు చేయకపోయింది. దాంతో కమల్ కూతురిగా నటించే అవకాశం పార్వతీ మీనన్ కు దక్కింది. అయితే ఈ విషయంపై శృతి చాలా బాధపడుతుంది."నాన్నకు కూతురిగా నటించే అదృష్టం చేయిదాకా వచ్చి జారిపోయింది. చాలా బాధగా ఉంది. కానీ నా ఇబ్బంది నాన్నకు కూడా తెలుసు. అందుకే ఆ విషయాన్నీ తేలిగ్గా తీసుకున్నారు. కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. భవిష్యత్తులో తప్పకుండా ఆయనతో నటిస్తాను" అని ఆత్మవిశ్వాసంతో చెప్తుంది శృతి.