English | Telugu

పవన్ పై  హీరోయిన్ శ్రీయా కీలక వ్యాఖ్యలు.. వైసిపీ నీకు సపోర్ట్ చేస్తుందా!

తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద తమదైన ముద్ర వేసి, తెలుగు ప్రేక్షకుల మనస్సులో గిలిగింతలు పుట్టించే హీరోయిన్స్ లో శ్రీయ(shriya saran) కూడా ఒకటి. నువ్వే నువ్వే, ఠాగూర్, చెన్నకేశవ రెడ్డి, శివాజీ,సంతోషం, గౌతమీ పుత్ర శాత కర్ణి, ఛత్రపతి, మనం, గమనం, బాలు లాంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. దాదాపుగా టాప్ స్టార్స్ అందరితోను చేసింది. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ లోను చేసి ప్రేక్షకుల దృష్టిలో ఇంకా వాంటెడ్ హీరోయిన్ గానే ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్(pawan kalyan)పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

శ్రీయ రీసెంట్ గా హైదరాబాద్ లోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. ఈ సంధర్భంగా పలు విషయాల గురించి మాట్లాడింది. అందులో పవన్ కళ్యాణ్ అంశం కూడా ఒకటి. మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాధించిన విజయం పట్ల నేనెంతో గర్వంగా ఉన్నాను. ప్రజలు ఆయన్ని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ప్రజలకి మంచి చెయ్యాలని తాపత్రయ పడుతుంటారు. చాలా సైలెంట్ గా ఉండి ఎక్కువగా శ్రమపడతారు. రానున్న రోజుల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించబోతున్నారని కూడా చెప్పింది. ఇప్పుడు ఈ మాటలు పవన్ ఫ్యాన్స్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే పవన్ ,శ్రీయ కలిసి బాలు(balu)మూవీలో చేశారు.2005 లో రిలీజ్ అయ్యింది. అంటే దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాలు అవుతుంది. అన్ని సంవత్సరాలు అయినా కూడా పవన్ మీద తనకున్న అభిమానం చెక్కుచెదరని విధంగా సూపర్బ్ గా మాట్లాడిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి పవన్ పై ఇరుచుకుపడే ప్రత్యర్థి వైసిపీ ఎలా తీసుంటుందో అనే మాటలు కూడా సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.

బాలు షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి కూడా చెప్పుకొచ్చింది. ఒక సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నపుడు పవన్ కాలికి గాయమయ్యిందని,ఆ విషయం ఎవరకి చెప్పకుండా సాంగ్ ని కంప్లీట్ చేసారని కూడా చెప్పుకొచ్చింది. అలాగే చిరంజీవి(chiranjeevi)తో కలిసి మరో సారి నటించాలని చెప్పిన శ్రీయ ప్రస్తుతం హనుమాన్(hanuman)ఫేమ్ తేజ సజ్జ మూవీ కి కమిట్ అయ్యానని వెల్లడి చేసింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.