English | Telugu
'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ రివ్యూ.. పూరి కమ్ బ్యాక్ ఇచ్చాడా..?
Updated : Aug 8, 2024
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' 2019 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రామ్ ఎనర్జీ, పూరి మార్క్ డైలాగ్ లు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' (Double ISMART) వస్తోంది. ఆగష్టు 15న విడుదలవుతున్న ఈ మూవీ, తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
'డబుల్ ఇస్మార్ట్' సినిమాకి సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ ఇచ్చారు. రన్ టైం 2 గంటల 42 నిమిషాలు అని సమాచారం. ఈ మూవీకి సెన్సార్ టాక్ పాజిటివ్ గానే వుంది. 'ఇస్మార్ట్ శంకర్' తరహాలోనే మాస్ ప్రేక్షకులు మెచ్చేలా దీనిని మలిచారట. రామ్ క్యారెక్టర్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటుందట. ముఖ్యంగా రామ్, సంజయ్ దత్ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోయాయని చెబుతున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ లో ఉంటుందట. ఇక డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. సామెతలు, వెటకారం జోడించి తెలంగాణ యాసలో వచ్చే డైలాగ్ లు బాగా పేలాయట. యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలతో రూపొందిన పక్కా కమర్షియల్ మూవీ అని.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఇస్మార్ట్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.
ఇది అటు రామ్ అభిమానులకు, ఇటు పూరి అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇద్దరు ఫ్లాప్స్ లో ఉన్నారు. మరి ఈ 'ఇస్మార్ట్ శంకర్' కాంబో.. 'డబుల్ ఇస్మార్ట్'తో హిట్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.