English | Telugu
శంకర్ ఉండగా...టెన్షన్ దండగా..!!
Updated : Dec 17, 2015
'బాహుబలి' సెట్ చేసిన హై స్టాండర్డ్స్‌ను 'రోబో-2' ద్వారా అధిగమించి తీరాలన్న కృత నిశ్చయంతో ఉన్న శంకర్ తన సినిమాను ప్రారంభి౦చాడు. ఓ సౌత్ ఇండియన్ మూవీ మీద ఏకంగా రూ.400 పెట్టుబడికి ఒప్పించడమంటే మాటలు కాదు. ఇది శంకర్ కు మాత్రమే సాధ్యమయ్యే ఘనత. ఐతే ఊరికే బడ్జెట్ పెట్టించేసి హంగామా చేసే టైపైతే కాదు శంకర్. ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ తెరమీద చూపిస్తాడు. ఆ మొత్తాన్ని రాబట్టడానికి పక్కా ప్రణాళికా రచిస్తాడు. కాబట్టి నిర్మాతలు టెన్షన్ పడాల్సిందేమీ లేదు.ఇండియాలోనే అత్యధికంగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. రజినీ సరసన అమీ జాక్సన్ ఈ సినిమాలో కథానాయికగా నటించనుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.