English | Telugu

బాహుబ‌లిని టార్గెట్ చేసిన‌ స‌ర్దార్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టి ఇప్పుడు బాహుబ‌లి సినిమాపై ప‌డిందా?? ఆ సినిమాని బ్రేక్ చేయాల‌న్న ఉద్దేశంతోనే స‌ర్దార్ - గ‌బ్బ‌ర్‌సింగ్ తీస్తున్నాడా?? ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాలు మాత్రం ప‌వ‌న్ టార్గెట్... బాహుబ‌లి సినిమానే అంటున్నాయి. బాహుబ‌లి- స‌ర్దార్ రెండింటిమ‌ధ్య ఎలాంటి పోలిక‌లూ లేవు. కానీ.. మార్కెట్ స్ట్రాట‌జీ విష‌యంలో ప‌బ్లిసిటీ విష‌యంలో బాహుబ‌లిని ఫాలో అయిపోతే బెట‌ర్ అన్న‌ది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆలోచ‌న‌. అందుకే.. ఇంట్రవెల్ ముందొచ్చే యాక్ష‌న్ సీక్వెన్స్‌ని భారీ లెవిల్లో ప్లాన్ చేశాడు ప‌వ‌న్‌. ఈ ఫైటు కోసం వంద గుర్రాల్ని తీసుకొచ్చారు. ఖ‌రీదైన కార్లు వాడుతున్నారు.మొత్తానికి ఈ ఒక్క ఫైటుకే రూ.3.5 కోట్లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్టు టాక్‌. ఇంతకు ముందు ప‌బ్లిసిటీ గురించి బొత్తిగా ప‌ట్టించుకోని ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఈ సినిమా విష‌యంలో మాత్రం మిన‌హాయింపు ఇచ్చాడ‌ట‌.

ఎక్ప్‌క్లూజీవ్ ఇంట‌ర్వ్యూలు ఏర్పాటు చేయాల‌ని, షూటింగ్‌కి సంబంధించిన విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాకు లీక్ చేయాల‌ని ప‌వ‌న్ సూచించాడ‌ట‌. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.75 కోట్ల వ‌ర‌కూ ఉండొచ్చ‌ని ఓ అంచ‌నా. బాహుబ‌లి త‌ర‌వాత ఇంత మొత్తం బిజినెస్ చేసిన సినిమా ఇదే. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ సినిమా నిల‌బ‌డితే. దాదాపు రూ.150 కోట్లు రాబ‌ట్టొచ్చ‌ని... క‌నీసం శ్రీ‌మంతుడు సినిమాని దాటేయాల‌ని చిత్రబృందం భావిస్తోంది. అందుకే... ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా వెనుకంజ వేయ‌డం లేదు. ఆడియో ఫంక్ష‌న్ కూడా భారీ ఎత్తున నిర్వ‌హించి ప‌బ్లిసిటీని ముమ్మ‌రం చేయాల‌ని స్కెచ్ వేసింది స‌ర్దార్ టీమ్. మ‌రి ఈ ఆశ‌లు ఏ మేరకు నెర‌వేర‌తాయో చూడాలి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.