English | Telugu

మెగాస్టార్ మూవీకి కూడా అదే ఫార్ములా.. తగ్గేదేలే అంటున్న రావిపూడి!

మెగాస్టార్ మూవీకి కూడా అదే ఫార్ములా.. తగ్గేదేలే అంటున్న రావిపూడి!

 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఒకరు. ఈ ఏడాది సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న అనిల్.. తన తదుపరి సినిమాని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో చేస్తున్నారు. చిరంజీవి కెరీర్ లో 157వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి 'మెగా 157' అనేది వర్కింగ్ టైటిల్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జెట్ స్పీడ్ లో వర్క్ జరుగుతోంది.

 

అనిల్ రావిపూడికి వరుస విజయాలు అందుకుంటాడని మాత్రమే కాకుండా, వేగంగా సినిమాలు తీస్తాడని కూడా పేరుంది. 'సంక్రాంతికి వస్తున్నాం'ని కూడా అలా వేగంగా పూర్తిచేసే.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇప్పుడు చిరంజీవి సినిమా విషయంలోనూ అదే జోరు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. (Chiru Anil)

 

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయినట్లు సమాచారం. రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని అంటున్నారు. చిరంజీవి యాక్టింగ్, డ్యాన్స్ లకే కాదు.. ఆయన కామెడీ టైమింగ్ కి కూడా ఎందరో అభిమానులున్నారు. సరైన స్క్రిప్ట్ పడాలే కానీ, కామెడీని అద్భుతంగా పండిస్తారు చిరు. ఇప్పుడు అనిల్ అలాంటి స్క్రిప్ట్ నే సిద్ధం చేసినట్లు వినికిడి.

 

కొత్త సినిమాని మొదలుపెట్టే ముందు.. సొంతూళ్లో పూజలు చేయడం అనిల్ రావిపూడికి అలవాటు. మెగాస్టార్ మూవీకి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఆదివారం నాడు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

 

పూజ తర్వాత సినిమా పనులు మరింత ఊపందుకోనున్నాయట. మే 19న చిరంజీవితో ఫోటోషూట్ నిర్వహించనున్నారు. ఆ వెంటనే షూట్ కి వెళ్లనున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయింది. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. 2026 సంక్రాంతికి ఖచ్చితంగా 'మెగా 157'ను తీసుకొచ్చేలా రావిపూడి దూసుకుపోతున్నారు.