English | Telugu
నాగ్ జోడీగా సమంత
Updated : Dec 11, 2014
మనంలో సమంత - నాగార్జున తల్లీకొడుకుల్లా నటించారు! నాగ్ సమంతని అమ్మా అమ్మా అని పిలుస్తుంటే... చూడ్డానికి ముచ్చటగా అనిపించింది. మరి ఇప్పుడు వీరిద్దరూ కలసి జోడీ కట్టడం ఏమిటి? రిలేషన్స్ రివర్స్ అయిపోవూ..?? అనుకొంటున్నారా?? అంత ప్రమాదం ఏమీ లేదు. వీరిద్దరూ జోడీగా తెరపై కనిపించేది సినిమా కోసం కాదు. `మీలో ఎవరు కోటీశ్వరుడు` పోగ్రాం కోసం. మా టీవీలో ప్రసారం అవుతున్న ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' రెండో సీజన్‌కీ అనూహ్యమైన స్పందన వస్తోంది. నాగ్ అప్పుడే తన షోకి సెలబ్రెటీలను తీసుకురావడం మొదలెట్టేశాడు. సీజన్ 2 లో తొలి సెలబ్రెటీ హోదా దక్కించుకొంది సమంత. నాగ్ అడిగిన అల్లరి ప్రశ్నలకు సమంత కూడా కొంటెగానే సమాధానాలు ఇచ్చిందట. ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కాబోతోంది. అన్నట్టు ఈ పోగ్రాం ద్వారా సమంత ఆరున్నర లక్షలు సంపాదించిందట. ఆ డబ్బును సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తానని నాగ్‌కి మాట ఇచ్చింది. నాగ్ ప్రశ్నలు - సమంత సమాధానాలు ఏ రీతిన సాగాయో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఓపిక పట్టాలి.