English | Telugu

మామ‌గారు కాబోతున్న‌ జ‌గ‌ప‌తిబాబు


లెజెండ్‌తో స‌రికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు జ‌ప‌గ‌తిబాబు. ఇప్పుడాయ‌న కెరీర్ జెట్ స్పీడులో ఉంది. రారా కృష్ణ‌య్య‌, క‌రెంటు తీగ‌, పిల్లా నువ్వు లేని జీవితం సినిమాల‌తో రెండో ఇన్నింగ్స్ తిరుగులేని విధంగా మొద‌లెట్టారు. ఇప్పుడు లింగ‌లోనూ కీల‌క పాత్ర పోషించారు. అన్న‌ట్టు నిజ జీవితానికి సంబంధించి కూడా కీల‌క నిర్ణ‌యాలు తీసుకోబోతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ్‌. జ‌గ‌ప‌తిబాబుకి ఇద్ద‌రు కూతుర్లు. అందులో ఓ అమ్మాయి పెళ్లీడుకొచ్చింది. అమెరికాలో ఇంటీరియ‌ల్ డిజైన‌ర్ కోర్స్ చేస్తోంది. పెద్దామ్మాయికి త్వ‌ర‌లోనే పెళ్లి చేయ‌బోతున్నారు జ‌గ‌ప‌తి. ఆమెకు అమెరికా సంబంధ‌మే కుదిరింద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వర్గాల స‌మాచార‌మ్‌. ప్ర‌తినాయ‌కుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్న జ‌గ‌ప‌తి.. తండ్రిగా త‌న బాధ్య‌త‌ను నెర‌వేర్చే ప‌నిలో ప‌డ్డారన్న‌మాట‌. త్వ‌ర‌లోనే జ‌గ‌ప‌తి ఇంటి నుంచి పెళ్లి వార్త వినే అవ‌కాశం ఉంది.