English | Telugu
అంజలి తట్టుకోగలదా...
Updated : Dec 11, 2014
సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు తరవాత అంజలి శరీరాకృతిలో బాగా మార్పొచ్చింది. మసాలా, గీతాంజలిలో మరింత బొద్దుగా కనిపించింది. గీతాంజలి సినిమా హిట్టయినా.. ఆవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. తమిళనాట బొద్దుగా ఉంటేనే ముద్దు. కానీ తెలుగు కథానాయికగా రాణించాలంటే మాత్రం.. స్లిమ్‌గా కనిపించాల్సిందే. అందుకే ఇప్పుడు నాజూగ్గా మరాలని నిర్ణయానికి వచ్చింది అంజలి. కనీసం 15 కిలోలు తగ్గాలని డిసైడ్ అయ్యిందట. అందుకే ఇప్పుడు జిమ్‌లో కసర్తులు చేస్తూ చమటోడుస్తోంది. గ్లామర్ పాత్రలు ఇచ్చినా చేయడానికి రెడీ అంటోందట. ఆ తరహా పాత్రలొస్తే చేయడానికి నాకు అభ్యంతరం లేదని దర్శక నిర్మాతలు చెప్తోందట. అంతేకాదు.. త్వరలోనే నన్ను కొత్తగా చూస్తారు. ఆ హామీ నాది, కాస్ట్యూమ్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొంటా అంటోందట. అంజలి ఇప్పటికిప్పుడు సన్నజాజి తీగలా మారిపోయినా.. అవకాశాలు రావడం కష్టమే. ఎందుకంటే రెజీనా, రకుల్ ప్రీత్‌సింగ్, ఆదాశర్మ, రాశీ ఖన్నాలాంటి యువ కథానాయికలు సరికొత్త పోటీకొచ్చేస్తోంటే అంజలి తట్టుకోగలదా?