English | Telugu

'సమంత' స్టార్ దొబ్బింది..!

టాలీవుడ్ లో వరుస హిట్లతో గోల్డెన్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న సమ౦తకు బ్యాడ్ టైమ్ మొదలైందా? ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ క్రమంగా వచ్చిన హిట్లతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ పొజిషన్ దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఆ పొజిషన్ కి ముప్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఒక్క “మనం” సినిమా తప్ప అన్నీ ఫ్లాపులే. ఆటోనగర్ సూర్య, అల్లుడు శీను, సికిందర్, రభస ఆమెకు భారీ చేదు అనుభవాలను మిగిల్చాయి. అలాగే ఈ ఏడాది ఎనభై శాతం ఫ్లాపులను మూటగట్టుకొని ఐరన్ లెగ్ గర్ల్ గా మారిపోయింది.

ఇదే విషయం ఇటీవల ఓ పార్టీలో తనను కలిసిన మీడియా వ్యక్తి అడగగా..సమంత వేదాంతం చెబుతోందట. అంతేకాదు ‘లక్కీ గర్ల్,’ ‘గోల్డెన్ గర్ల్’ అనే ట్యాగ్ ల పై తనకు నమ్మకం లేదని అటువంటి బిరుదులూ తనకు మీడియా ఎందుకు తగిలిస్తుందో అర్ధం కాదని కామెంట్ చేసింది. అదేవిధంగా అదృష్టం అనేది ఎవరి దగ్గరా శాస్వితంగా ఉండదని ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి జీవితాంతం అదృష్టవంతుడిగా కొనసాగాలి అనుకోవడం అవివేకం అని చెపుతోంది సమంత.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.