English | Telugu

మొన్న పెళ్లయ్యింది.. అప్పుడే యూటర్న్?

ఈ మధ్యే పెళ్లి చేసుకుంది సమంత... ఇంతలోనే వెంటనే యూటర్న్ తీసేసుకుంది. నిజంగా ఇది బాధాకరమైన విషయమే. ఏంటి? ఏవేవో ఊహించేసుకుంటున్నారా? అలాంటిదేం లేదులేండీ. మినిమమ్ ఓ వందేళ్లు వాళ్లిద్దరూ కలిసే ఉంటారు. అందులో నో డౌట్. సమంత తీసుకున్న యూటర్న్ ఏంటంటే... పెళ్లి చేసుకున్న తర్వాత తన వైవాహిక జీవితంతో బిజీ అయిపోయిన సేమ్. మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. కాస్త బ్యాలెన్స్ ఉన్న ‘రంగస్థలం’ షూటింగ్ పూర్తి చేసేసి... కొత్త ప్రాజెక్టులకు సైన్ పెట్టేస్తోంది. ఇదిలా ఉంటే కెరీర్ పరంగా సమంత తీసుకున్న మరో కొత్త నిర్ణయం... కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం. తానే నిర్మాతగా మారి సినిమాలు నిర్మించాలని సమంత నిర్ణయించింది. అందులో భాగంగా తొలి అడుగు కూడా వేయబోతోంది.

కన్నడంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై అఖండ విజయం అదుకున్న ‘యూ టర్న్’ అనే సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఆ సినిమాను తెలుగులో నిర్మించనుంది సమంత. అందరూ కొత్తవాళ్లే నటించిన ఈ కన్నడ సినిమా... కేవలం మౌత్ టాక్ తో బంపర్ హిట్ అయ్యింది. మరి తెలుగులో సమంత నిర్మించబోయే సినిమా... కొత్తవాళ్లతో ఉంటుందో.. లేక పాతవాళ్లే చేస్తారో చూడాలి. నిర్మాతగా మారే ముందు... మామగారి సలహాలు కూడా సమంత తీసుకుందట. అక్కినేనివారి కోడలు అంటే... అలాగే ఉండాలి మరి.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.