English | Telugu

రుద్రమదేవికి మెగా ఓపెనింగ్

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు రుద్రమదేవికి రూ.9 కోట్లకు పైగా షేర్ రావడం విశేషం. గ్రాస్ రూ.12 కోట్ల దాకా వచ్చింది. ఓవర్సీస్ - ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో కలిపితే ఇంకో రూ.3 కోట్ల దాకా షేర్ కలెక్టయి ఉండొచ్చని అంచనా. తొలి రోజు నైజాం ఏరియాలో రూ.3.5 కోట్ల దాకా షేర్ వచ్చినట్లు అంచనా. ఇక్కడ దిల్ రాజు రూ.12 కోట్లకు ‘రుద్రమదేవి’ హక్కులు కొన్నాడు. సీడెడ్ ఏరియాలో రూ.1.55 కోట్ల షేర్ వచ్చింది. ఉత్తరాంధ్రలో రూ.67 లక్షలు వసూలయ్యాయి. గుంటూరులో ఒక్క రోజుకే రూ.కోటి రూపాయలకు పైగా షేర్ రావడం విశేషం. అక్కడ రూ.1.05 కోట్లు వచ్చాయి. తూర్పు గోదావరిలో రూ.81 లక్షలు - పశ్చిమ గోదావరిలో రూ.66 లక్షలు - నెల్లూరులో రూ.47 లక్షలు - కృష్ణాలో రూ.47 లక్షలు వసూలయ్యాయి. మొత్తం ఏపీ వరకు రూ.5.68 కోట్లు కొల్లగొట్టింది రుద్రమదేవి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే లెక్క రూ.9.18 కోట్లు తేలింది. ఓవర్సీస్ - మిగతా రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్ ఎంత వసూలు చేసింది ఇంకా క్లారిటీ రాలేదు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.